సాయి పల్లవి, రానా జంటగా నటించిన సినిమా విరాటపర్వం..డైరెక్టర్ వేణు ఊడుగుల ఇంతకుముందు నీదీ నాదీ ఒకే కథ అనే సినిమాను తీశాడు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా 1992 లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వేణు తెరకెక్కించాడు.ఒక మర్డర్ మిస్టరీ. దానికి కాస్త ప్రేమకథను జోడించి కథగా రాసుకొని విరాటపర్వంగా తెరకెక్కించాడు వేణు. సాయిపల్లవి పాత్రే ప్రధానంగా ఈ సినిమాలో హీరో అంటే సాయి పల్లవే అని చెప్పాలి.
తన పాత్రే ఈ సినిమాకు హైలెట్. కామ్రెడ్ రవన్నగా ఈ సినిమాలో రానా నటించగా.. వెన్నెలగా సాయి పల్లవి నటించింది.కామ్రెడ్ భారతక్కగా ప్రియమణి నటించింది. అలాగే.. నవీన్ చంద్ర, నందితా దాస్ లాంటి వాళ్లు ప్రముఖ పాత్రల్లో నటించారు. మహాభారతంలోని విరాటపర్వాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగానే ఈ సినిమాకు విరాట పర్వం అనే పేరు పెట్టాడు దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్ వల్ల లేట్ అయింది.
ఇప్పటికే రానా.. భీమ్లా నాయక్ సినిమాలో నటించాడు. ఆ సినిమా తర్వాత రానా నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇంకొద్ది సేపట్లో ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో ప్రారంభం కానున్నాయి.. మొత్తానికి ఈ సినిమా లో సాయి పల్లవి పాత్ర హైలెట్ అయింది.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్ కథ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసారు.. మొదటి షో కు టాక్ ఓ మాదిరిగా ఉంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి..ఈ సినిమా వీరిద్దరికి హిట్ టాక్ ను అందిస్తుందొ లేదో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చెయ్యాలి.