టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయిన రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
రామ్ పోతినేని తన కెరియర్ లో ఇటు లవర్ బాయ్ ఇమేజ్ వున్న సినిమాలలో నటిస్తూనే , మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలలో కూడా నటిస్తూ ఇటు క్లాస్... అటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇటు క్లాస్... అటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని తన కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ది వారియర్ మూవీ లో నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా చిత్ర బృందం బుల్లెట్ సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సాంగ్ ను తమిళ హీరో శింబు పాడాడు.
ఈ సాంగ్ ను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేశారు. తాజాగా ఈ సాంగ్ ఓ రేర్ మార్క్ ని టచ్ చేసింది. బుల్లెట్ సాంగ్ తాజాగా తెలుగు వర్షన్ 6 కోట్ల వ్యూస్ ను సాధించగా, తమిళ వెర్షన్ 4 కోట్లకు పైగా వ్యూను సాధించింది. మొత్తంగా ఈ సాంగ్ తెలుగు , తమిళ భాషల్లో కలిపి పది కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇలా ది వారియర్ మూవీ లోని బుల్లెట్ సాంగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.