ఒకే రోజు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వున్న అనేక సినిమాలు విడుదల అవ్వడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల ఏ సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. ఒక వేళ ఏదైనా సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాకు తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే ఏదైనా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇతర సినిమాల ద్వారా పోటీ ఏర్పడి ఆ సినిమాకు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఈ
జూన్ 17 వ తేదిన కూడా బాక్సాఫీస్ దగ్గర దాదాపు ఇలాంటి పరిస్థితులే కనబడే అవకాశం కనిపిస్తోంది. ఈ
జూన్ 17 వ తేదీన ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న విరాట పర్వం , గాడ్సే సినిమాలు విడుదల కాబోతున్నాయి. విరాట పర్వం సినిమాలో
దగ్గుబాటి రానా హీరోగా నటించగా
సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో
ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటించింది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ
సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాతో పాటు సత్యదేవ్ హీరోగా
ఐశ్వర్య లక్ష్మి
హీరోయిన్ గా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్సే సినిమా కూడా
జూన్ 17 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ఈ ఇద్దరు
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఎ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి విజయంగా నిలుస్తుందో చూడాలి.