చిన్న హీరోకు సపోర్టుగా ఆ బడా ఫ్యామిలీ..!!
ఎందుచేతనంటే ఇది వరకు కూడా ఈ హీరో నుంచి వచ్చిన రాజావారు రాణి గారు అలాగే ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే చిత్రాలు బాగానే సక్సెస్ ను అందుకున్నాయి. ఆ తర్వాత సెబాస్టియన్ pc-524 చిత్రం విడుదల కాగా ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు సమ్మతమే అనే సినిమాతో మరొకసారి సక్సెస్ అందుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా జూన్ 24 గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ సినిమాను అవసరమైనంత స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. మొదటి రోజు ఈ సినిమా టాక్ బాగుంటే థియేటర్లు పెంచే అవకాశం ఎక్కువగా ఉందట. ఏదిఏమైనా ఇండస్ట్రీలో కొంత మంది పెద్దలు ఈ చిన్న హీరో కి సపోర్టు ఇవ్వలేదు అనే విమర్శలకు అల్లు అరవింద్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఇక గీత ఆర్ట్స్ ద్వారా అసలు కేవలం అగ్రహీరోల కాకుండా విజయ్ దేవరకొండ, నిఖిల్ తదితర చిన్న హీరోలు కూడా నటించే అవకాశాలు దక్కుతున్నాయి. ఇదే ఇప్పుడు మరొక చిన్న హీరో కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమాకు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు అల్లుఅరవింద్ పైన.