పూజా హెగ్డే కు మరి ఇంత క్రేజా.. !

Pulgam Srinivas
ప్రస్తుతం పూజా హెగ్డే కు ఇటు తెలుగు అటు తమిళ్ ఇండస్ట్రీ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు లో నటించిన రాధే శ్యామ్,  ఆచార్య రెండూ  మూవీ లు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.


అలాగే తమిళంలో నటించిన బీస్ట్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూడు సినిమా లలో రాధే శ్యామ్ మరియు బీస్ట్ రెండు మూవీ లు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇలా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా వరుస  ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే , విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ క్రేజీ మూవీ కోసం పూజ హెగ్డే అతి తక్కువ రోజులే కేటాయించనునట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం ఎక్కువే తీసుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


జనగణమన మూవీ కోసం పూజ హెగ్డే 5.5 కోట్ల రెమ్యునిరేషన్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కేవలం జనగణమన మూవీ మాత్రమే కాకుండా పూజా హెగ్డే నటించే ప్రతి సినిమాకు కూడా ఇదే రేంజ్ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పూజా హెగ్డే కు కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉండడంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మకు అడిగినంత ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: