పుష్ప 2 సస్పెన్స్.. సుక్కు ప్లాన్ ఇదేనా?

Satvika
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే..బన్నీ సినిమా కెరియర్ ఈ సినిమా తో రెట్టింపు అయ్యింది.కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాను చేస్తున్నారు. పుష్ప 2 సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అందుకే, ఈ మూవీ విషయంలో అసలు సుకుమార్ ఏం చేస్తున్నారో క్లారిటీ రావడం అంటూ బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.


పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్..ఆ వెంటనే ఈ మూవీ సీక్వెల్‌లో నటిస్తాడనే ప్రచారం జరిగింది. దర్శకుడు సుకుమార్ కూడా అదే ఊపులో అప్పుడు ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఫిబ్రవరిలోనే సినిమా సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసికురావాలని ప్లాన్ చేసుకున్నారు.అయితే, ఆ ప్లాన్స్ అన్నిటికీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చెక్ పెట్టాయి. వీటి సక్సెస్ ప్రభావం పుష్ప సీల్వెల్‌పై గట్టిగానే పడింది..



సుక్కూ స్క్రిప్ట్ చాలనే మళ్ళీ స్టోరీ రాయడం మొదలుపెట్టారు సుకుమార్. ఇంకా దీనికి సంబంధించిన చర్చలు అల్లు అర్జున్ – సుకుమార్‌ల మధ్యన జరగలేదట. బన్నీ ఏమో ఎప్పుడెప్పుడు పుష్ప కంప్లీట్ చేస్తే వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళాలా అని ఎదురుచూస్తున్నారట. 2021 క్రిస్మస్ కానుకగా వచ్చిన పుష్ప పార్ట్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిందని చెప్పక తప్పదు. కోవిడ్ మధ్య కూడా వరల్డ్ వైడ్ గా కలక్షన్ పరంగా వావ్ అనిపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ డాన్ గా ఎదిగిన పుష్పరాజ్ తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు..అనే విషయాన్ని కొత్తగా, స్పెషల్ గా పార్ట్ 2లో చూపించ నున్నారు.



జూలైలో ఫస్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పుష్ప2 ని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తాజా సమాచారం. పుష్ప 2 కథ విషయంలో అన్ని లెక్కల్ని సరిసమానంగా సెట్ చేసిన సుకుమార్ సినిమాను 6నెలల్లో పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడట...మరి సినిమా ఎలా వుంటుందో ఇప్పటి నుంచే సస్పెన్స్ రావడం విశేషం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: