మళ్ళీ దెబ్బ తిన్నావుగా నాని...!!

murali krishna

నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా రూపొందిన 'అంటే సుందరానికీ' సినిమా భారీ అంచనాల తో విడుదలైంది. ఓ మోస్తరు పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది.


కానీ, ఏం లాభం.? ఇది కూడా నాని కెరీర్‌లో మరో ఫ్లాప్ సినిమా.. అంటూ డిక్లేర్ అయిపోయిందట దాదాపు గా.!



రన్ మరీ దారుణంగా కనిపిస్తోందట. వారాంతం లో కూడా చాలా థియేటర్లు బోసిపోయాయ్. ఎందుకి పరిస్థితి.? అంటే, సినిమా లో కంటెంట్ మరీ అంత గొప్పగా ఏమీ లేకపోవడమేనట.. దానికి తోడు పెరిగిన టిక్కెట్ ధరలు. అన్నిటికీ మించి, సినిమా ఫ్లాప్ అయితే, రెండు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా.. అంటూ ఓటీటీ అభిమానుల ధీమాగా వున్నారు.



ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా ఈ ఓటీటీ ఫీవర్ నుంచి తప్పించుకోలేకపోతోందట.. పెద్ద హీరోల సినిమాల విషయంలో కూడా, 'ఓ నెల రోజులు వేచి చూద్దాం.. ఓటీటీలో వచ్చేస్తుంది కదా.! థియేటర్లకు వెళ్ళి డబ్బులెందుకు వృధా చేసుకోవడం.?' అన్న భావన సగటు సినీ ప్రేక్షకుల్లో పెరిగిపోయిందని తెలుస్తుంది..


నాని లాంటి హీరోల విషయంలో ఈ ఇంపాక్ట్ ఇంకా గట్టిగానే కనిపిస్తోంది. 'అంటే సుందరానికీ' సినిమా విషయంలో ఓటీటీ ప్రచారం అయితే జోరుగా సాగింది. పదిహేను రోజుల్లోనే ఓటీటీలో వచ్చేస్తుందన్న పుకార్లు, 'అంటే సుందరానికి' థియేటర్ వసూళ్ళను దెబ్బ తీసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయట.


ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లోకి తీసుకుంటే, 50 శాతం మేర నష్టాలు వాటిల్లినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయట. నాని అంటే ఒకప్పుడు ప్రామిసింగ్ హీరో. కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. నానీ కి ఈ మధ్య వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడం జరుగుతుంది. నానీ వరసుగా హిట్స్ కొట్టిన బ్రాండ్ హీరో గా మారాడు. కానీ ఇప్పుడు నానీ సినిమాలు మంచి ఓపెనింగ్స్ కూడా సాధించలేక పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: