టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన
కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు
రాణి గారు సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్న
కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం
మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం
కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో
కిరణ్ అబ్బవరం
పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఈ
సినిమా ఈ హీరోకు బాక్సాఫీస్ దగ్గర నిరాశను మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి
దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి
దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ
మూవీ ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు
కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ తో
కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు
మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ
సినిమా పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చు కున్నాయి. ప్రస్తుతం ఈ
మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ
మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఈ
మూవీ లో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి,
బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని,
భరత్ రొంగలి తదితరులు నటిస్తున్నారు. ఈ
మూవీ లో
కిరణ్ అబ్బవరం డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.