ఆఫర్స్ కోసం కాజల్ అంత పని చేసిందా....?
ఇది ఇలా ఉండగా కొడుకు పుట్టిన తర్వాత తల్లిగా అతని ఆలనా పాలన చూసుకుంటూ బాగా బిజీ బిజీ అయిన కాజల్ అగ్వర్వాల్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది..తాను సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని సంకేతాలు ఇస్తూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తుందట కాజల్ అగర్వాల్..తనకి తగ్గ పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తన వ్యక్తిగత మ్యానేజర్లతో ప్రముఖ నిర్మాణ సంస్థలకు మరియు OTT చానెల్స్ కి ఫోన్లు చేయిస్తుంది అట కాజల్ అగర్వాల్ ..అంత పెద్ద హీరోయిన్ సినిమాల్లో నటించడానికి సిద్ధం గా ఉన్నాను అని ప్రకటించగానే దర్శక నిర్మాతలు క్యూ కట్టాలి కానీ..ఇలా తానే స్వయంగా ఫోన్లు చేయించి అవకాశాల కోసం అడగడం ఏమిటి అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో తెగ ఫీల్ అవుతున్నారు..పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ క్రేజ్ బాగా తగ్గిపోయింది అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొన్నాయి..కానీ కాజల్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆమె అందం ఏ మాత్రం కూడా తరగలేదు అనేది అర్థం అయ్యిపోతుంది..పెళ్లి తర్వాత ఆమె నటించిన ఏకైక సినిమా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య..కథకి కాజల్ అగర్వాల్ పాత్ర అడ్డుగా వస్తుంది అని ఆమె సన్నివేశాలు కూడా ఈ చిత్రం నుండి తొలగించిన విషయం మన అందరికి తెలిసిందే..ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత ఆమెకి ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి మరి ..అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.