
ప్రభాస్ హీరోయిన్ కు ఆఫర్స్ కరువు...!!
వేదం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మిరపకాయ్ సినిమాతో దీక్షా సేథ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వాంటెడ్, నిప్పు, రెబల్ మరికొన్ని సినిమాలు కూడా దీక్షా సేథ్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. అందం, అభినయంతో దీక్షా సేథ్ మంచి పేరును సంపాదించుకున్నా కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలతో పోల్చి చూస్తే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం.
అయితే 2016 తర్వాత దీక్షా సేథ్ కు సినిమా ఆఫర్లు బాగా తగ్గాయి. ప్రభాస్, బన్నీలకు జోడీగా నటించినా దీక్షా సేథ్ కెరీర్ పుంజుకోలేదు. సౌత్ నుంచి దీక్షా సేథ్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం కూడా దాదాపుగా లేదని సమాచారం.. అదృష్టం లేకపోవడం వల్లే దీక్షా సేథ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారట.. దీక్షా సేథ్ ను పట్టించుకునే నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో లేకపోవడం విశేషం.
దీక్షా సేథ్ సినిమాలకు దూరమైనా ఆమెను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దీక్షా సేథ్ రాబోయే రోజుల్లో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సాధారణంగా స్టార్ హీరోలకు జోడీగా సినిమా ఆఫర్ వస్తే హీరోయిన్ల దశ తిరిగిపోతుంది. కానీ దీక్షా సేథ్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగిందట.. కథల ఎంపికలో దీక్షా సేథ్ చేసిన పొరపాట్లు కూడా ఆమె కెరీర్ కు కొంతవరకు మైనస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయిట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమవుతూ ఉండటం విశేషం. గ్లామర్ రోల్స్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న హీరోయిన్లకు తక్కువ సమయంలోనే అవకాశాలు తగ్గుతున్నాయి.