టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన
రానా దగ్గుబాటి తాజాగా విరాట పర్వం సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
రానా సరసన
సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా వేణు ఉడుగుల ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో
ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.
ఈ
మూవీ ని
జూన్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం తాజాగా ఈ
మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ
మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నిఖిల్ తాజాగా విరాట పర్వం
సినిమా చూసినట్లు తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నాడు. విరాటపర్వం
మూవీ ని చూసిన నిఖిల్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను తన సోషల్
మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశాడు. విరాట పర్వం
మూవీ ఎపిక్
లవ్ స్టోరీ నన్ను కాస్త షాక్ కు గురిచేసింది. అది మాత్రమే కాదు విరాట పర్వం
మూవీ చాలా అద్భుతంగా ఉంది.
సాయి పల్లవి కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ను ఇచ్చింది.
రానా దగ్గుబాటి నటన కూడా చాలా అద్భుతంగా ఉంది అని సోషల్
మీడియా పోస్ట్‌లో నిఖిల్ రాసుకొచ్చాడు.
విరాట పర్వం
మూవీ అద్భుతమైన వీక్షణగా మార్చిన వేణు ఊడుగులకి మరియు
సుధాకర్ చెరుకూరికి హ్యాట్సాఫ్ అని నిఖిల్ సోషల్
మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఇలా నిఖిల్ విరాట పర్వం
మూవీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.