నాని కస్సు బుస్సు లాడుతున్నాడా..?
ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత నాని దసరా మూవీ చేస్తున్నాడు. శ్రీకాత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో నాని ఈ సినిమాని ఓకే చేశాడు. తెలంగాణా నేపథ్యంతో పీరియాడికల్ మూవీగా దసరా సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. సినిమాలో నాని పూర్తి మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. అయితే నాని ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నారట. అనుకున్న విధంగా అవుట్ పుట్ రావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట.
ఆల్రెడీ మొదటి షెడ్యూల్ పూర్తైన ఈ సినిమా రష్ చూసిన నాని అనుకున్న విధంగా రావట్లేదని టీం తో చెప్పాడట. అంతేకాదు డైరక్టర్ కి కొద్దిగా క్లాస్ కూడా పీకినట్టు తెలుస్తుంది. చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో ఈ ఇబ్బందులు నాని ఊహించలేదు. ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నాని మరోసారి డైరక్టర్ తో డిస్కషన్స్ జరిపి సినిమా ఇక మీదట ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చేయాలని నిర్ణయించుకున్నారట. అంటే సుందరానికీ బజ్ చూస్తుంటే నాని ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది.