ఆ ఇద్దరు టాలీవుడ్ కుర్ర హీరోలతో డేట్ కు వెళ్ళడానికి నేను రెడీ... నిధి అగర్వాల్..!
ఈ రెండు మూవీ లు కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కు ఈస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర దక్కింది. ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితమే హీరో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పర్వాలేదు అని రిజల్ట్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇలా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తన నటనతో , అంతకుమించిన హాట్ హాట్ అందచందాలతో ఎంతో మంది మనసు దోచుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ ,పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే నిధి అగర్వాల్ కు పాన్ ఇండియా ఇండియా రేంజ్ లో క్రేజ్ రావడం పక్క. ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో ఓ అభిమాని మీరు డేట్ కి వెళ్ళాలి అంటే ఏ హీరో తో వెళ్తారు అని ప్రశ్నించగా. ఈ ప్రశ్నకు నిధి అగర్వాల్ సమాధానం ఇస్తూ... ఈస్మార్ట్ హీరో రామ్ పోతినేని తో లేదా అక్కినేని కుర్ర హీరో అఖిల్ తో డేట్ కి వెళ్తాను అని సమాధానం ఇచ్చింది.