
'మేజర్' పై 'విక్రమ్' మూవీ దెబ్బ... లేదంటే వసూళ్లు ఇంకా పెరిగేవి ?
అంతేకాదు ఈ మధ్యకాలంలో ఒక డబ్బింగ్ మూవీ టాలీవుడ్ పై ఈ రేంజ్ లో ప్రభావం చూపింది కూడా విక్రమ్ సినిమా కావడం మరో విశేషం. అయితే విక్రమ్ సినిమా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మేజర్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ రెండు సినిమాల పాజిటివ్ టాక్ కాస్త అక్షయ్ కుమార్ మూవీ సామ్రాట్ పృథ్వీ రాజ్’ పై పడి ఆ సినిమా లాస్ అయ్యింది అని సమాచారం. మేజర్ రిలీజ్ అయిన మూడు రోజులు కి 35 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక కమల్ ‘విక్రమ్’ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 150 కోట్ల కు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ ఇప్పటి వరకు దాదాపు 7కోట్ల షేర్ అందుకుని హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక వసూళ్ల విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ విడుదల అయిన తెలుగు మూవీ మేజర్ .....విక్రమ్ సినిమా ఎఫెక్ట్ లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసుండేది. మొత్తానికి ఈ రెండు సినిమాల జోరు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది. కలెక్షన్లు క్లోజ్ అయ్యేటప్పటికీ ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో చూడాలి.