"ఆదిపురుష్" లో కృష్ణంరాజు... దేవుడా ఈసారైనా కాపాడు?
పౌరాణిక నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం లో ప్రభాస్ పెదనాన్న , సీనియర్ హీరో కృష్ణం రాజు కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈ మూవీలో జనకమహారాజు పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారట. కాగా ఈ విషయం విని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ లాంటి హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సీనియర్ స్టార్ హీరో కృష్ణం రాజు అంటే ఈ తరం ప్రేక్షకులకు కూడా పర్సనల్ గా చాలా అభిమానం , ప్రేమ. అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే వచ్చే సంతోషమే వేరు అంటున్నారు. కాగా మరోవైపు కొందరు అభిమానులు మాత్రం ఈ విషయం పై ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నటుడు కృష్ణంరాజు హీరో ప్రభాస్ కలిసి ఇప్పటివరకు బిల్లా, రెబల్, రాదే శ్యాం ఇలా మూడు సినిమాలు చేయగా వాటిలో ఒకటి మాత్రం హిట్ అయ్యి మిగిలినవి నిరాశ పరిచాయి.
అందుకే ప్రభాస్ సినిమాలో పెదనాన్న అంటే కాస్త కంగారు పడుతున్నాం. నిజానికి వీరి కాంబో స్క్రీన్ పై కన్నుల పండుగగా ఉంటుంది కానీ ...ఆ చిన్న సెంటిమెంట్ కాస్త మమ్మల్ని ఇలా ఆలోచించేలా చేస్తోంది అంటూ ఆవేదన చెందుతున్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కానీ...ఇదే కాంబోలో వచ్చిన బిల్లా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు. అలాగే ఈ సినిమా కూడా అంచనాలకు మించిన ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 15 బాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. ఈ బడా మూవీ వచ్చే ఏడాది జనవరి 12 న పెద్ద పండుగ కానుకగా విడుదల కానుంది.