ఎన్టీఆర్ 30 : పనులను ప్రారంభించిన అనిరుద్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా 30 వ సినిమా . ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది.


మూవీ అధికారిక ప్రకటన లో భాగంగా ఈ సినిమాకు యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతునట్లు చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులను అనిరుద్ రవిచంద్రన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ లో దర్శకుడు కొరటాల శివ కూడా పాటిస్పేట్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాక ముందే అనిరుద్ రవిచంద్రన్ ఎన్టీఆర్ 30 వ సినిమా పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఈ ముద్దుగుమ్మె అంటూ ఇప్పటి వరకు అనేక మంది పేర్లు తెర పైకి వచ్చాయి. కాక పోతే వారి లో ఎవరిని కూడా చిత్ర బృందం ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు. మరి ఎన్టీఆర్ 30 వ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోందో చూడాలి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: