కొత్త స్ట్రాటజీలో అల్లు అరవింద్ !
లేటెస్ట్ గా అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన ‘గని’ ఘోరమైన ఫ్లాప్ గా మారి అతడి కుమారుడుకి భారీ నష్టాలను మిగిల్చింది అన్న వార్తలు వచ్చాయి. దీనితో సినిమాలు తీసే విషయంలో అంతర్మధనంలో అల్లు కాంపౌండ్ ఉన్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా అల్లు అరవింద్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ఇక రానున్న రోజులలో విడుదలయ్యే పెద్ద మీడియం రేంజ్ సినిమాలు అన్నింటికీ టిక్కెట్ల రెట్లు పెంపుదల ఉండకూడదని కేవలం పాత రేట్లకే సినిమాలను ప్రదర్శించి తీరాలని అరవింద్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు సినిమా విడుదలకు ఆ సినిమా ఓటీటీలో విడుదల అవ్వడానికి 50 రోజుల గ్యాప్ ఉండితీరాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నాడు. ఇలా చేయకపోతే భవిష్యత్ లో సినిమాలు తీయడం కష్టం అని అంటున్నాడు.
ఇప్పటికే అరవింద్ ఆలోచనలను దిల్ రాజ్ తన ‘ఎఫ్ 3’ విషయంలో అమలుపరిచాడు. భారీ అంచనాలు ఉన్న ఈసినిమాను పాత రేట్లకే తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసాడు. అయితే ఈమూవీ సగటు ప్రేక్షకుడికి పూర్తిగా నచ్చకపోవడంతో ఈమూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు కనీసం తమ అసలును రాబట్టుకుని బ్రేకీవెన్ కాగలుగుతారా అన్నసందేహాలు వస్తున్నాయి. దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన ‘మేజర్’ సూపర్ సక్సస్ అవ్వడంతో ‘ఎఫ్ 3’ కలక్షన్స్ మరింత తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోతే టిక్కెట్ల రేట్లు పెంచినా తగ్గించినా జనం పెద్దగా పట్టించుకోరు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..