నవ్యస్వామి పరువు తీసిన హైపర్ ఆది.. ఏమన్నాడో తెలుసా?

praveen
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అతిశయోక్తే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు హైపర్ ఆది పంచుల సునామితో ప్రతి ప్రేక్షకుడు కూడా పగలబడి నవ్వుతున్నాడు అని చెప్పాలి. సాదా సీదా  కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ టీమ్ లీడర్ గా మారిపోయాడు హైపర్ ఆది. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా రైటర్ గా కూడా సత్తా చాటుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు జబర్దస్త్ తో పాటు డాన్స్ రియాలిటీ షో  ఢీ లో కూడా టీం లీడర్ గా చేస్తున్నారన్న విషయం తెలిసిందే.


 ఢీ షో లో కూడా ఎప్పటికప్పుడు తనదైన రీతిలో  పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇక ఏ స్కీట్ చేసినా కూడా తనదే పైచేయి ఉండేలా చూసుకుంటూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవల ఢీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది, రవి కృష్ణ, నవ్య స్వామి, పాపి మాస్టర్ లు ఇద్దరు కలిసి స్కిట్ వేశారు.


 ఇందులో భాగంగానే ఎప్పటిలాగానే హైపర్ ఆది పంచులతో మీతో రెచ్చిపోయాడు అని చెప్పాలి. కాలేజీలో సీనియర్లుగా ఆది, రవికృష్ణ నటిస్తోంది అప్పుడే కొత్తగా వచ్చిన స్టూడెంట్ లాగా నవ్య స్వామి, పాపి మాస్టారు నటించారు.  ఆది సీరియస్గా ఏదో అనబోయేంతలో నవ్య స్వామి తన డైలాగ్ చెప్పేస్తుంది. దీంతో ఆది సీరియస్ గా చూస్తాడు.. మిగతావాళ్లంతా పగలబడి నవ్వుకుంటారు.  ఇటు రా అంటు నవ్య స్వామి నీ పిలిచి ఏ క్లాస్ అని అడిగితే.. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటుంది. దీంతో ఒక రకంగా చూసి కాలేజా అంటూ చూస్తాడు. కాదు స్కూల్ అని వెటకారంగా నవ్య స్వామి కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే నవ్య స్వామి వాక్ చేయమని అడిగితే సిగ్గుపడుతూ నడుస్తుంది నవ్య స్వామి. తర్వాత ఏంట్రా ఏమైనా పోయిందా అంటు నవ్య స్వామి వాకింగ్ పై కౌంటర్ వేసి పరువు తీశాడు హైపర్ ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: