ఓ సైనికుడు ఎలా ఉండాలి అనేదానికి చక్కటి ఉదాహరణే ఈ మేజర్ మూవీ. భారత సైనికుడు
సందీప్ ఉన్నికృష్ణన్ దేశానికి చేసిన సేవను ఈ చిత్రంలో ద్వారా చాలా బాగా చెప్పారు. 2008
నవంబర్ 26న
తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని కళ్లకు కట్టినట్టు ప్రెజెంట్ చేశాడు
సినిమా డైరెక్టర్ శశికిరణ్. మేజర్
సందీప్ తన ధైర్య సాహసాలతో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా చాలా మందిని ఎలా కాపాడాడో ఈ
సినిమా ద్వారా చూడొచ్చు. ఇంటర్వెల్ ముందు నుండి సెకండాఫ్ చివరి దాకా
సినిమా చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. అంతే కాదు
సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఖచ్చితంగా దేశభక్తిని చాటుతుంది ఈ సినిమా. ప్రతీ ఒక్కరూ కూడా సినిమాలో లీనమై భావోద్వేగానికి లోనవుతారు. అలాగే కొన్ని సీన్లకు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. అలా పకడ్బందీగా రాసుకున్నందుకు
హీరో శేష్ ను,
డైరెక్టర్ శశిని తప్పక అభినందించల్సిందే అంటున్నారు సినీ ప్రేక్షకులు.సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో మన అందరికీ తెలుసు. కానీ ఆయన ఎలా జీవించారో తెలియాలంటే ఖచ్చితంగా ఈ
సినిమా చూడాల్సిందే. ఆయన సోల్జర్ గానే కాకుండా ఒక కొడుకుగా ఇంకా
భర్త గా ఎలా ఉండేవాడనేది ఈ
సినిమా చెప్తుంది. తన ఎమోషనల్
జర్నీ ని ఈ
సినిమా పరిచయం చేసింది.
సందీప్ రోల్ లో
హీరో అడవిశేష్ జీవించి నటించాడని చెప్పాలి.
ఆర్మీ ఆఫీసర్ గా ఆ ఆహార్యం ఇంకా లుక్స్ సరిగ్గా సరిపోయాయి.డైరెక్టర్ శశి కూడా చాలా నైఫుణ్యంతో ఈ సినిమాను బాగా తీర్చి దిద్దాడు. ఎక్కడా కూడా అసలు బోర్ కొట్టనివ్వకుండా తీశాడు.
అయితే ఫస్టాఫ్ లో
లవ్ ఎపిసోడ్ కాస్త స్లో గా అనిపించినా ఇంటర్వెల్ ముందు నుండి ఈ
సినిమా ఊపందుకుంటుంది.
హీరోయిన్ సయి మంజ్రేకర్ బాగా చేసింది. తెలుగు మోడల్
శోభిత ధూళిపాల్ల ఒక ఇంపార్టెంట్ రోల్ లో రాణించింది.అలాగే తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతిల నటన అధ్బుతం అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో అయితే కంటతడి పెట్టిస్తారు.వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా రిచ్ గా ఉంది. అలాగే
శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అయితే సినిమాను ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ని తెప్పించాడు. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఇంకా ఆర్ట్ వర్క్ అన్నీ బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్
హీరో ఈ
సినిమా వెనక ఉండటం అభినందనీయం. ఓవరాల్ గా మేజర్
మూవీ బాగా మెప్పిస్తుంది.. మేజర్
సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ
సినిమా చూడాల్సిందే. తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా ఈ
సినిమా కు మంచి గుర్తింపు వస్తుందనడంలో అసలు ఏ మాత్రం సందేహం లేదు. ఫైనల్ గా ఇది తప్పకుండా అందరూ చూడదగ్గ చిత్రం.