ఏ మాత్రం తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్... 57 దేశాల్లో ట్రెండింగ్..!

Pulgam Srinivas
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ప్రతి చోటు నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అన్ని చోట్ల కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేసింది.


మొత్తం మీద ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ని ముగించుకునే సరికి 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేసుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో అదిరిపోయే రెస్పాన్స్ లో తెచ్చుకున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ప్రస్తుతం 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ను కనబరుస్తుంది.  


అయితే ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రముఖ 'ఓ టి టి'  నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలలో ట్రెండింగ్‌ లో కొనసాగుతోంది. ఇలా ఇప్పటికి కూడా 'ఆర్ ఆర్ ఆర్' మేనియా ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా నడుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో  అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రేయ , సముద్ర ఖని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: