పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ 50 శాతం వరకు పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు నిలిచిపోయింది. కొంతకాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది.
తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఇప్పటికీ పూర్తి అయ్యింది. కాకపోతే తిరిగి మళ్లీ కొత్త షెడ్యూల్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఆఖరి షెడ్యూల్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు తిరిగి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమాపై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా హరిహర వీరమల్లు సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కాకపోవడానికి ఇదే కారణం అంటూ ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే... 'హరిహర వీరమల్లు' సినిమాలోని స్క్రిప్ట్ లోని కొన్ని సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ మార్పులను సూచించాడు అని, అప్పటికే ఆ సన్నివేశాలను క్రిష్ జాగర్లమూడి చిత్రీకరించడంతో పవన్ కళ్యాణ్ బాధ పడ్డాడు అని వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో చిత్ర బృందం ఉండడంతో ఇప్పటివరకు తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాలేదు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొట్ట మొదటి సారి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. పాన్ సినిమా కావడంతో నిర్మాతలు కూడా ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.