బిగ్ బాస్ హోస్ట్ గా సమంతను అందుకే సెలెక్ట్ చేశారా?

Satvika
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. టీఆర్పి రేటింగ్ తో పాటు జనాలను అన్నీ విధాలుగా ఆకట్టుకుంది.. హోస్ట్ లు మారినా ఎంటర్టైన్మెంట్ లో మాత్రం తగ్గలేదు..వంద రోజుల ప్రయాణం జనాలను ఆకర్షించింది. ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు షో ట్రెండ్ అవుతూ వస్తుంది. నాగ్ యాంకరింగ్ జనాలను బాగా మెప్పించింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ ను కూడా చేశాడు. తెలుగులో ఐదు సీజన్లను పూర్తీ చేశారు. కాగా, ఇప్పుడు మరో వార్త సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కోడుతుంది..

 

వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 సామాన్యులకు పట్టం కట్టనుంది. ఈ షో అంటే ఇష్టపడేవాళ్లు తమ కలను సాకారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశమని యాజమాన్యం చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సీజన్ ఆడిషన్స్ జరగనున్నాయి . ఇకపోతే ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారు అనేది అందరికి తెలిసిందే.. అయితే ఈ షో హోస్ట్ గా వేరే వ్యక్తిని తీసుకొస్తున్నారని టాక్..



అయితే ఆ హోస్ట్ ఎవరో కాదు నాగ్ మాజీ కోడలు సమంత అంట.. గతంలో కొన్ని రోజులు నాగార్జున లేనప్పుడు సమంత ఈ రియాలిటీ షోను హోస్ట్ చేసిన సంగతి తెల్సిందే.. ఇక దీంతో నాగార్జునను వదిలి యాజమాన్యం సమంతను సంప్రదించారని, అందుకు సామ్ కూడా ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. అక్కినేని ఫ్యామిలీ మీద కోపంతో ఒప్పుకున్నది అని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. లేకపోతే వరుస పాన్ ఇండియా మూవీస్ ను లైన్లో పెట్టుకొని అన్ని రోజులు ఈ షో కు డేట్స్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు.. అందులోను ఇప్పటివరకు సామ్ హోస్ట్ గా చేసినా షోలు అన్ని ప్లాప్ టాక్ తెచ్చుకున్నవే..అయిన సామ్ నే కావాలని అనుకున్నారట..ఆమె ఎలా చెస్తుందొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: