టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన అడవి శేషు తాజాగా మేజర్ సినిమా లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మేజర్ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను చిత్ర బృందం ప్రదర్శించింది . చిత్ర బృందం ప్రదర్శించిన ఈ ప్రీమియర్ షో లకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగి పోయాయి . ఇది ఇలా ఉంటే మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక సారి మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపు కున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.
నైజాం : 3.50 కోట్లు .
సీడెడ్ : 2 కోట్లు .
ఆంధ్ర : 4.50 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సినిమా 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 1 కోటి .
ఓవర్ సీస్ లో 2 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది . 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మేజర్ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.