టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ లో కూడా రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అదరగొట్టాడు.
చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ది వారియర్ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు తమిళ క్రేజీ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలలో నుంచి బుల్లెట్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ది వారియర్ మూవీ నుండి రెండో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ది వారియర్ మూవీ నుండి 'దడ దడ' అనే రెండవ లిరికల్ సాంగ్ ను జూన్ 4 వ తేదీన మధ్యాహ్నం 12.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది.
మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జులై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో రామ్ పోతినేని కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ పోతినేని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.