పెళ్లి కాకుంటే చరణ్ తో.. అలా చేసేదాన్ని : బాలీవుడ్ హీరోయిన్

praveen
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన రామ్ చరణ్  క్రేజ్ త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత మాత్రం ఇండియా లెవెల్ లో పాకి పోయింది. ఈ క్రమంలోనే ఇక రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు అటు బాలీవుడ్ దర్శకులు కూడా కథలను సిద్ధం చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో రామ రాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.


 ఇకపోతే రామ్ చరణ్ పై ఇటీవలే ఒక హీరోయిన్ మనస్సు పారేసుకుంది అన్న వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా హీరోయిన్ లకు కూడా కొంతమంది హీరోలపై క్రష్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా నాకు కూడా రామ్ చరణ్ పై క్రష్ ఉంది అంటూ చెబుతుంది ఇక్కడ ఒక బ్యూటీ. ఆమె ఎవరో కాదు మిస్ యూనివర్స్ బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్లర్. ఇటీవలే రామ్చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు నటించిన పృద్విరాజ్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది అనే విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీబిజీగా ఉంది.


 ఒక ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సినిమా హీరోయిన్ మానుషి చిల్లర్. ఈ సందర్భంగా ఒక హీరోతో డేట్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు అంటూ యాంకర్ ఒక ప్రశ్న అడిగింది.  ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో డేటింగ్ కి వెళ్లాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. అంతే కాదు అతనికి పెళ్లి కాకుంటే తప్పకుండా డేట్ కీ వెళ్లేవాడిని అంటూ హాట్ కామెంట్స్  చేసింది ఈ హాట్ బ్యూటీ. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: