వామ్మో : ఎఫ్ - 3 .... షాకింగ్ కలెక్షన్స్ ..... ??
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఎఫ్ 3 ప్రేక్షకాభిమానులందరి అంచనాలు అందుకుని ప్రస్తుతం మంచి విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా పై అంచనాలు బాగా ఉండడంతో ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. ఇక తొలి రోజు తొలి ఆట నుండి సినిమాకి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో ఎఫ్ 3 మూవీ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా యుఎస్ఏ, నైజాం సహా పలు ముఖ్య ప్రాంతాల్లో ఎఫ్ 3 మూవీ ఊహించిన దాని కంటే కూడా ఎంతో ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతోందని, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ మూవీ ఎంతో ఎట్రాక్ట్ చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
పెద్దగా ఆకట్టుకునే కథ లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు సినిమా యొక్క కథనాన్ని మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు ఆకట్టుకునే కామెడీ సీన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో అద్భుతంగా నడిపించారని, ఓవరాల్ గా ఎఫ్ 3 మూవీ చూడడానికి వెళ్లిన తమకి చాలావరకు మంచి వినోదం లభిస్తోందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చాలా ఏరియాల్లో షాకింగ్ రేంజ్ లో ఎఫ్ 3 మూవీ అదరగొడుతూ ఉండడంతో నిర్మాత దిల్ రాజు సహా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.