సినిమానేజీవితం కాదంటున్న హీరోయిన్.. కారణం..!!
హీరోయిన్ యామి గౌతమ్ చిట్ చాట్ తో మాట్లాడుతూ.. తాను సినిమానే తన జీవితం అన్నట్లు భావించనని తెలియజేసింది. కేవలం అది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అని తెలియజేసింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులతో మాత్రం తమ సమయాన్ని గడుపుతానని.. అమే తనకు ఇష్టమైనవి అని తెలియజేశారు. వృత్తి జీవితం మరియు పర్సనల్ జీవితమనేది ఎప్పుడూ కూడా వేర్వేరుగానే చూడాలని తెలియజేసింది. అలా చూసినప్పుడు మాత్రమే మన జీవితంలో సంతోషం అనేది ఉంటుందని యామిగౌతమ్ తెలియజేసింది.
కేవలం తమ జీవితంలో సినిమానే తప్ప మరేమీ లేదు అనుకుంటే.. రాబోయే రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో సినిమా తప్ప మరేం కనిపించవు.. అప్పుడు ఎంత బాధ పడ్డా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు కేవలం శూన్యం అన్నట్లుగానే తెలియజేసింది ఆమె. హీరోయిన్ గా వరుస సినిమాలు చేయాలనే కోరిక తనకు లేదని.. అందివచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తూ తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉండాలనేదే ఆమె కోరిక అన్నట్లుగా తెలియజేసింది. మొదటిసారిగా యామి గౌతమ్ మోడల్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్ అని కమిట్ అవ్వకుండా కొన్ని కొన్ని సినిమాలు చేస్తూ తన కెరీర్ని సాఫీగా ముందుకు తీసుకు వెళుతుంది.