'సారంగ దరియా' పాటను కాపీ కొట్టిన బాలీవుడ్.. వైరల్ వీడియో?
అయితే ఇక ఇప్పుడు సినిమాలనే కాదు ఏకంగా పాటలను కూడా బాలీవుడ్ లో కాపీ కొట్టేస్తున్నారు అన్నది తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన సారంగ దరియా పాటను హిందీ లో జో ముజే దివానా కర్ దే అనే లిరిక్ తో కాఫీ కొట్టేసారూ. కానీ ప్రేక్షకుల ఊరుకుంటారా చిన్న కాపీ వస్తేనే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడతారు. మరి ట్యూన్ మొత్తం కాపీ చేస్తే ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తలకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో సారంగ దరియా పాట యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఒక రకంగా కనుమరుగవుతున్న జాన పదానికి ఈ పాట ఊపిరి పోసింది అని చెప్పడం లో అతిశ యోక్తి లేదు. ఇక ఇప్పుడు ఈ జానపదాన్ని బాలీవుడ్లో మక్కీకి మక్కీ కాపీ కొట్టి అడ్డం గా బుక్ అవడం గమనార్హం. పాటకు సంబంధించిన మ్యూజిక్ కూడా అచ్చుగుద్దినట్టు గా దింపడం గమనార్హం. గణేష్ హెగ్డే అనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఇక ఈ పాటకు డాన్స్ అందించాడు. ఇక ఈ కాఫీ సాంగ్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.