మద్యం మత్తులో మరో మహిళా నటి... ప్రమాదంలో కెరీర్ ?
అయితే కొంతకాలం తర్వాత ఫేం తగ్గి అవకాశాలు తగ్గడం తో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. కానీ ఇపుడు అదికూడా దక్కేలా కనిపించడం అందుకు ఆమె అలవాట్లే కారణమని సర్వత్రా గుసగుసలు వినపడుతున్నాయి. మద్యానికి బానిస అయిన ఆమె ఎంతగా తాగుతోంది అంటే...సెట్స్ కి కూడా ఒక రౌండ్ వేసే వస్తున్నారట దాంతో దర్శకులు సైతం ఈమె కి ఇపుడు అవకాశాలు ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు అని అంతా వినపడుతోంది. అయితే ఎంతో డీసెంట్ గా కనిపిస్తూ చాలా సెంటిమెంట్ పండించే పాత్రల్లో కనిపించే ఈ నటికి ఇలాంటి అలవాటు ఉంది అంటే నమ్మడం కష్టమే కానీ అది నిజం. గత కొన్ని రోజులుగా ఆర్ధికంగా మెంటల్ గా సఫర్ అవుతున్న ఈ నటి టెన్షన్లతో, స్ట్రెస్ కు లోనై మద్యానికి మరింత దగ్గరయి టీ కాఫీ లు తాగినంత ఈజీగా లిక్కర్ ను తాగేస్తుంది. ఓ మేనేజర్ కమ్ ఫైనాన్సియర్ ను ఎంతగానో నమ్మిన ఈమె అతడి కారణంగా ఉన్నది, సంపాదించింది అంతా పోగొట్టుకుంది.
అయితే అలా బాధల్లో, కష్టాల్లో మునిగిపోయిన ఆమె రాత్రి, పగలు అని తేడా లేకుండా...తాగడం మొదలుపెట్టింది అని అలా ఆమెకు మద్యం సేవించడం బాగా అలవాటు అయిపోయి బాగా మారిపోయారు. అయితే ఇలా ముందుకు బానిసై, మానసికంగా కుంగిపోతున్న ఈమెను మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అక్కున చేర్చుకున్నాడు. స్నేహంగా ఉంటూ ఆ తరవాత తన ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు అని అంటున్నారు. ఈ నటుడు ఒకప్పుడు హీరోగా కూడా కొన్ని కామెడీ చిత్రాలు చేశాడు. అయితే ఆ తరవాత నుండి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయ్యి చాలా చిత్రాలు చేస్తున్నాడు. ఈయన తల్లి టాలీవుడ్ లో ఒక పెద్ద దర్శకురాలు కూడా. అయితే ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వాటిని పెటాకులు కూడా చేసుకున్న ఈ నటుడు ఇపుడు ఆ నటితో సహజీవనం చేస్తున్నారట. ఆమెని మరింత ఎంకరేజ్ చేస్తూ చెడు అలవాట్లు కు అలవాటు పడేలా చేస్తున్నారట. ఇంకేముంది అసలే మత్తుకు బానిస అయిన ఈమె ఇపుడు ఇతడి అండ చూసుకుని గంటలు తరబడి సిట్టింగ్స్ వేస్తూ గ్లాస్ మీద గ్లాస్ అంటూ ఎంజాయ్ చేస్తూ కెరియర్ ని ప్రమాదం లోకి నెట్టేసుకుంటుంది, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటోంది. ఎవరైనా చెప్పిన అస్సలు చెవికి ఎక్కించుకోక పోగా వారిని కూడా కలిపి తిడుతోందట ఆ నటి.