యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మనసు పెట్టి మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకు మించిన మూవీ లలో నటిస్తున్నాడు .
అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, సలార్ , ప్రాజెక్టు కే సినిమా లలో నటిస్తున్నాడు. ఈ మూవీ లలో ఆది పురుష్, సలార్, పాన్ ఇండియా సినిమా లుగా తెర కెక్కుతూ ఉండగా ప్రాజెక్ట్ కే మూవీ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పీరిట్' సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మారుతి హర్రర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందు కోసం ఇప్పటికే ఒక సెట్ ను కూడా వేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ సెట్ లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం జరగనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మారుతి తక్కువ రోజుల్లో ముగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.