అందాల ముద్దుగుమ్మ
అనుష్క గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అనుష్క టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.
మొదటి సినిమాలోనే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన
అనుష్క, తన మొదటి సినిమాతోనే తన నటనతో కూడా ఎంతో మంది ప్రశంసలను అందుకున్న
అనుష్క సూపర్
సినిమా తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక
సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలాగే
అనుష్క ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎంతో కాలం పాటు తెలుగు
సినిమా ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్ గా కొనసాగింది. దర్శక ధీరుడు
రాజమౌళి తెరకెక్కించిన
బాహుబలి సినిమాతో
అనుష్క పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే
అనుష్క 'నిశ్శబ్దం' మూవీ తర్వాత ఇప్పటి వరకు ఎ
మూవీ లోను నటించలేదు.
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా
నవీన్ పొలిశెట్టి హీరోగా యూ
వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో
అనుష్క నటించబోతోంది.
ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ
అనుష్క మాత్రం ఈ
సినిమా షూటింగ్ లో ఇప్పటి వరకు జాయిన్ కాలేదట. దానికి ప్రధాన కారణం
అనుష్క ప్రస్తుతం అధిక బరువుతో ఉండటమే అని తెలుస్తోంది. బరువు తగ్గిన తర్వాతనే
సినిమా షూటింగ్ లో జాయిన్ కావాలనే ఉద్దేశంలో
అనుష్క ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణం గానే ప్రస్తుతం
నవీన్ పొలిశెట్టి హీరోగా యు
వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో
అనుష్క లేకుండా వచ్చే సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తున్నారు తెలుస్తోంది. ప్రస్తుతం
అనుష్క బరువు తగ్గే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.