'శివ కార్తికేయన్' 20వ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ తమిళ నాట ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.
 


శివ కార్తికేయన్ కొన్ని రోజుల క్రితం విడుదలైన డాక్టర్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమాతో శివకార్తికేయన్ వందకోట్ల కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టాడు. ఇలా ఈ సినిమా తమిళనాట బ్లాక్బస్టర్ విషయం కావడంతో ఇదే సినిమాను తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదల చేయగా , ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది.  ఇలా డాక్టర్ విజయంతో ఫుల్ సక్సెస్ లో ఉన్న శివ కార్తికేయన్ తాజాగా డాన్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా అటు తమిళ ఇటు తెలుగు రెండింటిలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన డాన్ మూవీ జూన్ 10 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.


ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయన్ తెలుగు దర్శకుడు జాతి రత్నాలు మూవీ తో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కె.వి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా శివ కార్తికేయన్ కెరియర్ లో 20 వ సినిమా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ  అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఎస్ కే 20' మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: