షాకింగ్ సునీల్ వెయిటింగ్ లిస్టులో 10వేల సినిమాలు !
అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది సునీల్ వెయిటింగ్ లిస్టులో పెట్టిన ఆ 10వేల సినిమాలు అతడు చేయవలసిన సినిమాలు కాదు. అతడు చూడవలసిన 10వేల సినిమాల సీడీలు అట. సునీల్ షూటింగ్ ల కోసం ఏదేశానికి వెళ్ళినా లేదా ఏరాష్ట్రానికి వెళ్ళినా అక్కడ రకరకాల కొత్త పాత సినిమాల సీడీ లను కొనే అలవాటు గత 15 సంవత్సరాలుగా కొనసాగుతోందట.
అలా అతడు పోగు చేసుకున్న సీడీల సంఖ్య 12వేలు అయితే అందులో 2వేల సినిమాలను ఇప్పటివరకు చూసాడట. ఇంకా తాను చూడవలసిన సినిమాల సంఖ్య 10వేల వరకు ఉండటంతో ఆసినిమాలు అన్నీ తన జీవితంలో పూర్తిగా చూడగలనా లేదా అన్న అపనమ్మకం తనకు ఉందట. తాను ఎంత ప్రయత్నించినా రోజుకు ఒక్క సీడీని మించి చూడలేకపోతున్నానని సునీల్ బాధపడుతున్నాడు.
ఇక ‘పుష్ప’ మూవీలో విలన్ గా నటించిన తన నటన నచ్చి హిందీ కన్నడ మళయాళ భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయని అయితే తనకు ఆఫర్ చేయబడ్డ పాత్ర ఎంతో బాగుంటే కాని తాను ఒప్పుకోవడం లేదు అంటూ సునీల్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. తన కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినప్పటికీ తాను సెటిల్ అవ్వడానికి తన తల్లి నిరంతరం చేసే పూజలను తాను నమ్ముతాను అంటూ సునీల్ తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. సునీల్ కు ఇప్పటికీ హీరోగా సెటిల్ అవ్వాలి అన్న తన కోరిక పోలేదని చెపుతూ మంచి కథతో ఎవరైనా వస్తే తాను హీరోగా చేయడానికి రెడీ అంటున్నాడు..