'అంటే సుందరానికి' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేది అప్పుడే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ లో ఆమె పాత్ర పేరు లీలా థామస్. ఈ మూ వీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. శ్యామ్ సింగరాయ్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత నాని నటిస్తున్న సినిమా కావడం,  మెంటల్ మదిలో,  బ్రోచేవారెవరురా లాంటి రెండు వరుస విజయా ల తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంటే సుందరానికి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచ నాలు పెట్టుకున్నారు.

 ఈ అంచనాలకు తగ్గట్టు గానే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. వివేక్ సాగర్ ఈ మూవీ కి సంగీతం సమకూర్చాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అంటే సుందరానికి చిత్ర బృందం తాజాగా ఒక అప్డేట్ ను విడుదల చేసింది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ను మే 30 వ తేదీ ఉదయం 11.07 నిమిషాలకు తెలియజేయునట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మూవీ ని మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ నిర్వహిస్తున్నారు. ఈ మూవీ ని జూన్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: