పాన్ ఇండియా చిత్రాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్..!!

Divya
ఈ మధ్యకాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమా లు అంటూ తెగ ప్రచారం జరుగుతున్నా యి. కొందరు పాన్ ఇండియా చిత్రాల విధానాన్ని తప్పుబడుతూ ఉంటే మరికొందరు మాత్రం ఇండియా కాదు ఇండియన్ సినిమాలే ఆని కామెంట్లు చేస్తున్నారు. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. పాన్ ఇండియా సినిమాల పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినది.

పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ సినిమాలు అంటూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కానీ.. చాలా సంవత్సరాల నుండి సౌత్ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు హిందీలో డబ్ చేస్తే చూస్తారని తెలిపింది. టీవీలలో మాత్రం సౌత్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయని..తెలుగు తమిళ సినిమాలు హిందీ ప్రేక్షకులు ఆదరిస్తూ అభిమానిస్తూ ఉన్నారని తెలిపింది. ఇప్పుడు థియేట్రికల్ లో సినిమాలు విడుదలవుతున్నాయి డబ్బింగ్ సినిమాలు కూడా ఉత్తరాదిన మంచి విజయాన్ని అందుకునందువల్ల సౌత్ హీరోలు మరింత గా  పాపులారిటీ సంపాదిస్తున్నారని రకుల్ తను అభిప్రాయంగా తెలియజేసింది.

దేశం మొత్తం విడుదల అవ్వడం స్థానిక భాషల్లో విడుదల అవడం వల్ల విజయాన్ని అందుకున్నాయి సినిమాలని తెలిపింది. సినిమా అంటేనే ఏదో ఒక భాషకు చెందినది కాదు.. భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎమోషన్ తో సక్సెస్ అవుతాయి.. సినిమా అంటే ఒక భాష కాదు ఎమోషనల్ అని ఆమె తెలియజేసింది. ఇక్కడ సినిమాలు అక్కడ, అక్కడ సినిమాలు ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది ఇది ఒక శుభసూచకమని తెలిపింది. అందుచేతనే పాన్ ఇండియా ఇంకేదో అంటూ వివాదాలు సృష్టించుకో వలసిన అవసరం లేదని తెలిపింది. రకుల్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమైంది కేవలం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. మరి సౌత్ లో అడుగు పెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: