రామ్ చరణ్ సినిమా కోసం ఆ టైటిల్ ని పరిశీలిస్తున్న శంకర్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా,  ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో సునీల్ , అంజలి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

 ఇప్పటికే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తాజాగా వైజాగ్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర బృందం మూడు టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 'అధికారి' అనే టైటిల్ ను చిత్ర బృందం కన్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో   రామ్ చరణ్ 'ఐపీఎస్'  అధికారి గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 దానితో ఈ మూవీ కి అధికారి అనే టైటిల్ అయితే బాగుంటుంది అని చిత్ర బృందం ఒక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.  ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు మరియు సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా లోని సాంగ్స్ విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రామ్ చరణ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: