నాచురల్ స్టార్ నాని కొన్ని రోజుల క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత నాని హీరోగా నటిస్తున్న సినిమా కావడం , మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి రెండు వరుస విజయాల తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంటే సుందరానికి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇలా భారీ అంచనాలు కలిగి వున్న ఈ సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం టీజర్ మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. అంటే సుందరానికి సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అంటే సుందరానికి సినిమా నుండి చిత్ర బృందం ఒక క్రేజీ అప్ డేట్ ను విడుదల చేసింది.
తాజాగా అంటే సుందరానికి చిత్ర బృందం ఈ సినిమా నుండి మరో లిరికల్ వీడియో సాంగ్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. రాంగో రంగా అనే లిరికల్ సాంగ్ ను మే 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి సినిమాను జూన్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. నాచురల్ స్టార్ నాని ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. దసరా సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.