వామ్మో : మహేష్ కోసం త్రివిక్రమ్ .... పెద్ద ప్లాన్ వేసినట్లున్నారే .... ??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అతడు, ఖలేజా రెండూ కూడా ఎప్పటికీ ఆయన చెప్పుకునే క్లాసిక్స్ గా మిగిలిపోతాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఆ విధంగా ఇప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు టివిల్లో ప్రసారం అయినపుడు మంచి రేటింగ్స్ అందుకోవడమే అందుకు నిదర్శనం. 

అయితే వీటిలో అతడు మంచి సక్సెస్ కాగా, ఖలేజా మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక అతి త్వరలో చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ జోడీ మరొక మూవీకి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. మహేష్, త్రివిక్రమ్ కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా చేయనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనుండగా థమన్ సంగీతాన్ని అందించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మది చాయాగ్రాహకుడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ జులై ఫస్ట్ వీక్ లో పట్టాలెక్కనుంది.

అయితే విషయం ఏమిటంటే, ఈసారి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుందట. ముఖ్యంగా మహేష్ పాత్రతో పాటు సినిమా యొక్క కథ, కథనం కేవలం మహేష్ ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ అందరికీ కూడా ఎంతో మంచి కిక్ ని ఇస్తాయట. ఎలాగైనా సూపర్ స్టార్ తో తాను చేస్తున్న ఈ మూవీ పెద్ద సక్సెస్ కొట్టేలా ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారట త్రివిక్రమ్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందే ఇంత హైప్ అందుకుందంటే, రేపు తెరకెక్కి ఆపై విడుదల తరువాత పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయంగా కనపడుతోందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: