కోలీవుడ్
హీరో శివ కార్తికేయన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విషయాలను అందుకొని
తమిళ నాట ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న
శివ కార్తికేయన్ రేమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. రేమో
సినిమా శివ కార్తికేయన్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకు రావడంతో ఆ తర్వాత
శివ కార్తికేయన్ నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో భాగంగా కొన్ని సినిమాలు
టాలీవుడ్ లో కూడా మంచి విజయాలను సాధించాయి.
కాలేజ్ డాన్
మూవీ తమిళ , తెలుగు బాషలలో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన కాలేజ్ డాన్
మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే టాక్ తెచ్చుకుని, కలెక్షన్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో సాధిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా
శివ కార్తికేయన్ తెలుగు స్టార్
కమెడియన్ బ్రహ్మానందం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శివ
కార్తికేయన్, బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ... నేను బ్రహ్మానందం గారికి చాలా పెద్ద అభిమానిని, బ్రహ్మానందం కు చాలా
కామెడీ టైమింగ్ ఉంది. నాకు భాష అర్థం కాకపోయిన బ్రహ్మానందం ప్రతిచర్యలను అనుసరించడానికి ప్రయత్నిస్తాను అని
శివ కార్తికేయన్ తాజాగా తెలియజేశాడు.