హాట్
బ్యూటీ డింపుల్ హయాతి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ హయాతి,
వరుణ్ తేజ్ హీరోగా
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన
గద్దలకొండ గణేష్ సినిమాలోని 'జర జర' అనే స్పెషల్ సాంగ్ లో కనిపించి తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపింది.
గద్దల కొండ గణేష్ మూవీ లోని స్పెషల్ సాంగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్
బ్యూటీ కి ఆ తర్వాత
కోలీవుడ్ క్రేజీ
హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు సినిమాలో
హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
ఈ
సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాగా ఈ
సినిమా రెండు భాషల్లో కూడా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఈ సినిమాతో పాటు
మాస్ మహారాజా
రవితేజ హీరోగా
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాలో కూడా డింపుల్ హాయతి
హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై డింపుల్ హాయతి బోలెడన్ని ఆశలు కూడా పెట్టుకుంది. అలాగే ఈ సినిమాలో డింపుల్ హయాతి కూడా తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఈ సినిమాలో ఓలకబోసింది. అయినప్పటికీ ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇలా ఒక స్పెషల్ సాంగ్ తో వరుస అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డింపుల్ హయాతి,
బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించకపోవడానికి ప్రధాన కారణం... ప్రస్తుతం డింపుల్ హయాతి నాలుగు సినిమాలలో నటించడం వల్ల ,
బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ కు డేట్ లను సర్దుబాటు చేయలేక
బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది.