ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు సినిమాలను 'ఓ టి టి' లలో చూడడానికి ఎ రేంజ్ ఆసక్తిని చూపిస్తున్నారో మన అందరికి తెలిసిందే. అలా ప్రేక్షకులు సినిమాలను 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నరు.
అందులో భాగంగా కొన్ని
సినిమా లను నేరుగా 'ఓ టి టి' లో విడుదల చేస్తూ, ఉంటే మరి కొన్ని సినిమాలను
థియేటర్ లలో విడుదల అయిన తర్వాత 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.
అందులో భాగంగా
షాహిద్ కపూర్ హీరోగా మృణాళిని ఠాకూర్
హీరోయిన్ గా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన
హిందీ జెర్సీ 'ఓ టి టి' విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
థియేటర్ లలో పర్వాలేదు అనే రేంజ్ రిజల్ట్ ను తెచ్చుకున్న ఈ
సినిమా మే 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది.
హిందీ 'జెర్సీ'
సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన
జెర్సీ సినిమా కు అఫీషియల్
రీమేక్ గా తెరకెక్కింది. మరి
హిందీ జెర్సీ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.