దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా పై విడుదలకు ముందు నుండే ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్న విషయం మన అందరికి తెలిసిందే. అలా ఎన్నో అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్షన్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో వసూలు చేసింది. ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్నో కొత్త రికార్డ్ లను కూడా సృష్టించింది.
ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసింది ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు 'ఓ టి టి' లోవిడుదల అవుతుందా... అని ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫీషియల్ ' ఓ టి టి' విడుదల తేదీ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ని జూలై 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ 5 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. కాకపోతే జి 5 'ఓ టి టి' లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు , తమిళ , మలయాళం , కన్నడ వర్షన్ లలో మాత్రమే అందుబాటులో ఉండబోతుంది. ఈ విషయాన్ని కూడా జీ 5 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది.