లోక నాయకుడు కమల్ హాసన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తన కెరియర్ లో ఎన్నో విజయ వంతమైన మూవీ లలో నటించి హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కమల్ హాసన్ తన కెరియర్ లో కమర్షియల్ మూవీ ల కంటే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమా లలో నటించడానికి కెరియర్ ప్రారంభం నుండి ప్రాముఖ్యతను ఇస్తూ ఒక గొప్ప నటుడి గా ఎంతో మంది ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్ హసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్ తో విక్రమ్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విక్రమ్ మూవీ చిత్ర బృందం ఈ నెల 15 వ తేదీన విక్రమ్ మూవీ ట్రైలర్ తో పాటు అదే రోజు సాయంత్రం గ్రాండ్ గా ఆడియో లాంచింగ్ కార్యక్రమం కూడా ఉంటుందని ప్రకటించారు.
విక్రమ్ మూవీ చిత్ర బృందం ఈ విష యాన్ని తెలియజేస్తూ సేవ్ ది డేట్ అంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ ని జూన్ 3 వ తేదీ న విడుదల చేయనున్నారు. మరి విక్రమ్ మూవీ తో కమల్ హాసన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.