
బంఫర్ ఆఫర్ ను కొట్టేసిన సాయి పల్లవి..
ప్రస్తుతం ఈమె వరుస సినిమాల లో నటిస్తుంది.. అయిన కూడా మరో సినిమా ఆమె కోసం క్యూ లైన్లో ఉన్నాయి..ఇప్పటికే రానా సరసన విరాట పర్వం సినిమాతో రానుంది. గార్గి అనే మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది. వీటితో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది.తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది సాయి పల్లవి. ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు, కమల్ హాసన్ ని కలిసినట్టు తన సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది.
కమల్ గారు చాలా పెద్ద వారు.. ఇండస్ట్రీలో వారికి ఉన్న క్రేజ్ అందరికి తెలుసు. అలాంటి వారిని ఒకసారి చూస్తె చాలు అనుకున్న కానీ అతనితో పెద్ద సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది.కమల్ హాసన్ తో దిగిన ఫోటోలని షేర్ చేసిన సాయి పల్లవి.. 'ఈ సమావేశంలో నేను కమల్ హాసన్ సర్ దగ్గరి నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన పాఠాలు నేర్చుకుంటాను అనుకున్నాను. కానీ మంచి వ్యక్తిగా మారేందుకు అవసరమైన పాఠాలని నేర్చుకున్నాను. ఈ మీటింగ్ నాకెంతో ప్రత్యేకం. ఆయన నిర్మిస్తున్న సినిమాలో నేను చేయడం నా అదృష్టం అని చెప్పింది.ఆ సినిమా పై ఇప్పుడే ఆసక్తి నెలకొంది.