పది రోజుల్లో 'ఆచార్య' మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కీలకమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు , మామూలు సినీ అభిమానులు కూడా ఎన్నో అంచనాలను  పెట్టుకున్నారు.


ఎన్నో అంచనాల నడుమ  థియేటర్ లలో విడుదల అయిన ఆచార్య సినిమా విడుదలైన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను సాధించుకుంది. అలా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్  దగ్గర తెచ్చుకున్న ఆచార్య సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా ఆశించిన రేంజ్ లో దక్కడం లేదు.  ఇది ఇలా ఉంటే ఆచార్య మూవీ పది రోజులకు గాను రెండు తెలుగు రాష్టాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో చూద్దాం.


మొదటి రోజు ఆచార్య మూవీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 29.50 కోట్ల కలెక్షన్ లను సాధించింది, రెండవ రోజు 5.15 కోట్లు , మూడవ రోజు 4.07 కోట్లు , అయిదవ రోజు 82 లక్షలు , ఆరవ రోజు 26 లక్షలు , ఏడవ రోజు 12 లక్షలు ,  ఎనిమిదవ రోజు 8 లక్షలు , తొమ్మిదో రోజు 6 లక్షలు , పదో రోజు 8 లక్షల కలెక్షన్లను ఆచార్య మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది. ఆచార్య మూవీ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  40.67 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా ,  59.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: