అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృతి శెట్టి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఉప్పెన మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. కృతి శెట్టి నటించిన తొలి తెలుగు సినిమా తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఉప్పెన మూవీ తో తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ హీరోయిన్ గా ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత నటించిన బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం , రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ది వారియర్ సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా విడుదల కాబోతుంది. ది వారియర్ మూవీ తో కృతి శెట్టి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. ఉప్పెన సినిమాతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న కృతి శెట్టి కి దాదాపు ఒకేసారి అరడజన్ సినిమాల అవకాశాలు దక్కాయి.
కానీ అవన్నీ కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాలే. ఇప్పటి వరకు ప్రతి శెట్టి కి ఒక స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశం రాలేదు. ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కలేదు. మరి ప్రస్తుతం కృతి శెట్టి నటిస్తున్న సినిమాలు విడుదల అయ్యే లోపు అయిన ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరో సరసన నటించే అవకాశం తగ్గుతుందో... లేదో... చూడాలి.