2018లో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో రికార్డు హిట్ కొట్టాడు కొరటాల శివ. ఈ సినిమా తర్వాత ఆచార్య సినిమా చేసేందుకు ఈయనకు ఏకంగా నాలుగేళ్లు టైం పట్టింది.ఇటు చిరంజీవితో సినిమా ఓ పట్టాన తెరకెక్కకపోవడంతో పాటు అటు హీరోయిన్ ఎంపిక ఇంకా చివరకు ఈ ప్రాజెక్టులోకి చెర్రీ రావడం అలాగే కథలో మార్పులు ఇంకా కరోనా కష్టాలు.. రిలీజ్ డేట్లు వాయిదాలు పడి ఎట్టకేలకు గత నెల 29 వ తేదీన ఆచార్య థియేటర్లలోకి వచ్చింది. కట్ చేస్తే సినిమా వారం రోజులకే ఫైనల్ రన్ ముగిసేంత డిజాస్టర్ టాక్ ని తెచ్చింది.నాలుగు సంవత్సరాలుగా కొరటాల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కట్ చేస్తే ఈ సినిమా కోసం కొరటాల తన కెరీర్‌లో నాలుగేళ్ల విలువైన సమయంని బాగా వృథా చేశాడు.
ఈ సినిమాకు కొరటాల బడ్జెట్ నేపథ్యంలో రెమ్యునరేషన్ ని తీసుకోలేదు. నిర్మాత నిరంజన్ రెడ్డికి కొంత అమౌంట్ ఇచ్చి సినిమా బరువు ఇంకా బాధ్యతలు అన్నీతానే తీసుకున్నాడట. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు భారీ రేట్లకు అమ్మడంతో వాళ్లకు అమౌంట్ ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా కొరటాల శివ మీదే పడింది.ఇక ఓవరాల్‌గా చూస్తే కొరటాల శివ మామూలుగా సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటే రు. 25 కోట్ల రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ అమౌంట్ పోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మరో రు. 30 నుంచి 35 కోట్లు వెనక్కు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే కొరటాల శివకు రు. 60 కోట్లవరకు నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.పాపం అనవసరంగా కొరటాల శివ సినిమా చేసి చాలా నష్టపోయాడు. కెరీర్ లో అసలు ప్లాపులు లేని ఇమేజ్ కొరటాలకి వుంది. కానీ ఈ సినిమసాతో కొరటాలకి పెద్ద మచ్చ పడింది.