'నేను ఉన్నాను...నేను విన్నాను' డైలాగ్ పెట్టడానికి కారణం అదే...పరశురామ్

Pulgam Srinivas
దర్శకుడు పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  దర్శకుడు పరశురామ్ 'యువత'  సినిమాతో దర్శకుడిగా కెరియర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత ఆంజనేయులు , సోలో , శ్రీరస్తు శుభమస్తు , గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోవడంతో ప్రస్తుతం పరశురామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పరశురామ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు.  ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో సర్కారు వారి పాట చిత్ర బృంద సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంటూ  సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా దర్శకుడు పరశురామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.  ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పరశురామ్ కు 'నేను విన్నాను.. నేను వున్నాను'  అనే డైలాగ్ ను సర్కారు వారి పాట మూవీ లో పెట్టారు.. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణా? అనే ప్రశ్న ఎదురైంది.


ఈ ప్రశ్నకు దర్శకుడు పరశురామ్ సమాధానం ఇస్తూ... నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారిని చుస్తే ఒక హీరో ఫీలింగ్. చాలా గొప్ప మాటని చాలా  సింపుల్‪ గా చెప్పేశారు. సర్కారు వారి పాట మూవీ లో  కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ బాబు గారు ఆ డైలాగ్ ను చెప్పారు. నేను ఈ మూవీ కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి కూడా చెప్పాను. మహేష్ బాబు గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది అని,  ఆ సీన్ అద్భుతంగా వుంటుంది సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: