వరుస ప్లాపులతో డ్తెలమాలో హీరోయిన్లు..

Satvika
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు గా ఓ ఊపు ఊపెసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు వరుస ప్లాపులతో డ్తెలమాలో ఉన్నారు. సినిమాలు చేస్తున్నా కూడా సరైన. హిట్ లేక నిరాశ పడుతున్నారు..సీనియర్ హీరోయిన్స్ అని చెప్పుకునే భామలందరి లేటెస్ట్ సినిమాలు ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోతున్నాయి.. అయిన ఎక్కడ తగ్గకుండా వచ్చిన అవకాసాలను అందుకుంటు సినిమాలను చేస్తున్నారు..నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జోష్ చూపిస్తున్నారు. సౌత్ క్వీన్స్ వరుసగా ఫ్లాప్ సినిమాల్ని వాళ్ల అకౌంట్ లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్స్ గా చలామణీ అవుతోన్న ముద్దుగుమ్మల లాస్ట్ రిలీజ్ లను చూస్తే ఫట్ మన్నవే కనిపిస్తున్నాయి..


ప్లాప్ లతో పని లేకుండా మరో క్రేజీ ప్రాజెక్ట లను అందుకుంటున్నారు. కాదు వాక్కుల రెండు కాదల్ సినిమాతో నయనతార రీసెంట్ గా ఫ్లాప్ కొట్టింది. కానీ ఈమె చేతిలో చిరూ గాడ్ ఫాదర్, షారుఖ్ ఖాన్ లయన్, రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలున్నాయి.కాదు వాక్కుల రెండు కాదల్ మూవీ సామ్ ఫ్లాప్ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరింది. అయితే దీంతో సామ్ కి వచ్చే పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆమె చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఉన్నాయి. శాకుంతలంతో పాటూ యశోద, అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ వంటి వాటితో పాటూ బాలీవుడ్ లో డైరెక్ట్ గా వరుణ్ ధావన్ తో ఓ సినిమా చెస్తుంది..విజయ్ సరసన మరో సినిమా చెస్తుంది.


రాధేశ్యామ్, బీస్ట్, లేటెస్ట్ ఆచార్య వరకు లైన్ కట్టి మరీ బుట్టబొమ్మకు ప్లాప్స్ ఎదురవుతున్నాయి.. అయిన తగ్గ లేదు.. మరో రెండు ప్రాజెక్టు లు రెడీగా ఉన్నాయి.ఇకపోతే బాలివుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది.కృతిశెట్టి, శ్రీలీల, సంయుక్త మీనన్ లాంటి యంగ్ హీరోయిన్స్ వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తూ బిజిగా మారుతున్నారు. మరోవైపు శ్రీనిధి శెట్టి లాంటి వాళ్లు రూల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సాయి పల్లవి లాంటి వాళ్లు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అటు బాలీవుడ్ భామల ఎంట్రీ అదుర్స్ అనిపించే రేంజ్ లో ఉండబోతుంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే సినిమా కెరీర్ అయిపోయినట్లే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: