దగ్గుబాటి
రానా ,
సాయి పల్లవి ప్రధాన పాత్రలలో
వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం
సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ
సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో
దగ్గుబాటి రానా రవన్న అనే కామ్రేడ్ పాత్రలో కనిపించబోతున్నాడు ఇప్పటికే ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న విరాటపర్వం
సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది.
చిత్ర బృందం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో విరాట పర్వ సినిమాను 'ఓ టి టి' లో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. విరాట పర్వం మూవీ ని దర్శకుడు
వేణు ఊడుగుల నిజ
జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ
మూవీ లో
రానా,
సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు,
సాయిచంద్ ముఖ్య పాత్రలను పోషించారు. బెనర్జీ, నాగినీడు,
రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్,
ఆనంద్ రవి,
ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో ఈ
మూవీ లో నటించారు. విరాటపర్వం సినిమాకి
సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
ఈ
మూవీ కి డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ
సినిమా విడుదల తేదీ గురించి ఎంతో మంది సినీ ప్రేమికులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విరాటపర్వం
మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర బృందం ఒక
పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.